Kakinada: గోర్స గ్రామంలో నిలిచిన నీటిని పరిశీలించిన రావు అక్షయ్!

Kakinada: నియోజకవర్గం గోర్స గ్రామంలో తుఫాను నీటిని జనసేన ఇన్‌చార్జ్ రావు అక్షయ్ పరిశీలించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తక్షణ చర్యలకు అధికారులతో మాట్లాడారు.

RAMA KRISHNA, KKD
Published on: 26 Sept 2026 8:20 AM IST
Kakinada
X

Kakinada: గోర్స గ్రామంలో నిలిచిన నీటిని పరిశీలించిన రావు అక్షయ్!

Kakinada: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం... కొత్తపల్లి మండలం. గోర్స గ్రామంలో తుఫాను ప్రభావంతో నిలిచిన పోయిన నీరు నీటి సమస్య పరిష్కారానికి అధికారులతో, నాయకులుతో మాట్లాడిన కొత్తపల్లి జెనసేన ఇంచార్జ్ రావు అక్షయ్.

ఉప ముఖ్యమంత్రి , జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతినిధిగా, ఉప్పాడ–కొత్తపల్లి మండల జనసేన పార్టీ ఇన్‌చార్జ్ రావు అక్షయ్ గోర్స గ్రామంలో తుఫాను ప్రభావంతో నిలిచి పోయిన నీటిని పరిశీలించారు.

గోర్స గ్రామంలోని వినాయకుని గుడి వద్ద మరియు నూతన సచివాలయం సమీపంలోని ప్రధాన రహదారిపై నీరు నిలిచిన విషయం తెలుసుకున్న రావు అక్షయ్ సంబంధిత ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు.

అనంతరం సంబంధిత అధికారులతో సమస్యపై మాట్లాడి, నిలిచిన నీటిని తొలగించడంతో పాటు సమస్యకు పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏ ఈ భవాని , గోర్స గ్రామ జనసేన పార్టీ నాయకులు,గంధం నాగేంద్ర , గ్రామ నాయకులు పాల్గొన్నారు.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD