Kakinada: భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటన
Kakinada: కాకినాడ జిల్లాలో భారీ వర్షాల కారణంగా సెప్టెంబర్ 24న అన్ని విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ.
Kakinada: భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటన
కాకినాడ: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రేపు (సెప్టెంబర్ 24, గురువారం) జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
వాతావరణ పరిస్థితులు మరియు వర్షాల తీవ్రత దృష్ట్యా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆదేశాలు జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు తక్షణమే వర్తిస్తాయని స్పష్టం చేశారు.




