Kakinada: రోడ్డు వేసేంత వరకు ఓటేయం: గ్రామస్తుల భీష్మ ప్రతిజ్ఞ!

Kakinada: కాకినాడ జిల్లా కాజులూరు మండలం తుమ్మలపల్లి లంక గ్రామస్తులు రహదారి సమస్య పరిష్కారం కాలేదని స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 Oct 2026 11:06 PM IST
Kakinada
X

Kakinada: రోడ్డు వేసేంత వరకు ఓటేయం: గ్రామస్తుల భీష్మ ప్రతిజ్ఞ!

కాకినాడ: కాజులూరు మండలం ఆర్యావటం గ్రామ పంచాయతీ పరిధిలో గల తుమ్మలపల్లి లంక గ్రామస్తులు తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర దుమారం రేకెత్తిస్తోంది. తుమ్మలపల్లి లంక గ్రామానికి పూర్వ కాలం నుంచి ఉన్న రోడ్డును ఏడాది క్రితం కొందరు వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో రోడ్డు తొలగించారని గ్రామస్తులు ఆరోపణలు.

అప్పటినుంచి తమకు రోడ్డు సరిగ్గా లేకపోవడంతో అత్యవసర సమయాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. రహదారి సమస్యపై జిల్లా ఉన్నతాధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించుకున్నప్పటికీ రోడ్డు పునర్మానానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు.

రహదారి సమస్య పరిష్కారం కాకపోవడానికి నిరసనగా ప్రస్తుతం జరుగుతున్న ఎంపిటిసి, జడ్పిటిసి, పంచాయితీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేసిన గ్రామస్తులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్