Kakinada: కాకినాడలో కూటమి నేతల ఐక్యతా భేటీ.. రెబెల్స్‌కు కఠిన హెచ్చరిక!
Kakinada: ఎంపీ సానా సతీష్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కూటమి నాయకుల మీడియా సమావేశం జరిగింది. ఎవరైనా రెబెల్స్‌గా పోటీ చేసినా, మద్దతిచ్చినా పార్టీల నుంచి బహిష్కరిస్తామని నేతలు హెచ్చరించారు.
Kakinada: కాకినాడలో కూటమి నేతల ఐక్యతా భేటీ.. రెబెల్స్‌కు కఠిన హెచ్చరిక!
కాకినాడ: ఎంపీ సానా సతీష్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కూటమి నాయకుల మీడియా సమావేశం. సమావేశంలో పాల్గొన్న కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కొండబాబు,నానాజీ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, జనసేన అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు,బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు. కూటమి ఐక్యతగా ఉందని, కూటమి అధ్యక్షుల నిర్ణయానికి కట్టుబడి కలిసి పని చేస్తాం.
మొదటిసారి మూడు పార్టీల జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్ అనంతలక్ష్మి, ఇద్దరు ఎంపీలు కలిసి సమావేశమై చర్చలు. ఎవరైనా రెబెల్స్‌గా పోటీ చేస్తే వెంటనే సస్పెండ్ చేస్తామని, రెబెల్స్‌కు మద్దతు ఇచ్చే వారిని కూడా పార్టీల నుంచి బహిష్కరిస్తామని కూటమి నేతల హెచ్చరిక. గత స్థానిక సంస్థల ఎన్నికల తరహాలోనే కాకినాడ కార్పొరేషన్‌లోని మొత్తం స్థానాలను గెలుచుకునే లక్ష్యంతో మూడు పార్టీలు ముందుకు వెళ్తాం.
సీట్లు దక్కని మూడు పార్టీల ఆశావహుల జాబితాను సిద్ధం చేశాము.వచ్చే ఏడాది లోపల నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కల్పిస్తామని హామీ. మేయర్, జడ్పీ చైర్మన్ వంటి పదవుల కేటాయింపు రాష్ట్ర స్థాయిలో కుల, పార్టీ సమీకరణాల ఆధారంగా జరుగుతుందని, ఇవాళ సాయంత్రానికి పూర్తి స్పష్టత వస్తుంది.
కాకినాడను ప్రశాంతంగా, గంజాయి రహితంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఎన్నికల్లో ఎలాంటి అరాచకాలను సహించం. కూటమిలో పోటీ ఎక్కువగా ఉందని, చిన్న చిన్న చర్చలను కలహాలుగా భావించాల్సిన అవసరం లేదు...కూటమి పై ప్రజలకు పూర్తి స్పష్టత ఉంది. కాకినాడ కూటమి నేతలు.




