Kakinada: కాకినాడ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ డిపి సైబర్ మోసాలు హెచ్చరిక

Kakinada: కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఫోటోతో స్పామ్ కాల్స్, మెసేజ్‌లు. ప్రజలు నమ్మవద్దని, స్పందించవద్దని జిల్లా యంత్రాంగం తీవ్ర హెచ్చరిక.

RAMA KRISHNA, KKD
Published on: 2 Nov 2026 10:24 PM IST
Kakinada
X

Kakinada: కాకినాడ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ డిపి సైబర్ మోసాలు హెచ్చరిక

కాకినాడ: కాకినాడ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఫోటోను ఉపయోగించి కొందరు వ్యక్తులు స్పామ్ కాల్స్, సందేశాలు పంపుతున్నట్లు జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చింది.

ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పేరుతో లేదా ఫోటోతో వచ్చే గుర్తుతెలియని ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాలను జిల్లా ప్రజలు ఎవరూ నమ్మవద్దని, వాటికి స్పందించవద్దని జిల్లా యంత్రాంగం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

ఇటువంటి అనుమానాస్పద కాల్స్, సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి వ్యక్తిగత లేదా ఆర్థిక వివరాలను వెల్లడించవద్దని ప్రజలకు సూచించింది.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD