Yeleswaram: ఏలేశ్వరంలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల పరిశీలన
Yeleswaram: కాకినాడ జిల్లా ఏలేశ్వరం మున్సిపాలిటీలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలు, అప్పన్నపాలెం వంతెనను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Yeleswaram: ఏలేశ్వరంలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల పరిశీలన
కాకినాడ జిల్లా: ఏలేశ్వరం మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేoదిర ప్రసాద్, స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ రూమ్ లను పరిశీలించారు.
రిసెప్షన్ సెంటర్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ రూమ్ లను మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఏలేశ్వరం అప్పన్నపాలెం వంతెనను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ ఏలేశ్వరం మున్సిపాలిటీ స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ ప్రదేశాలను పరిశీలించమని అన్నారు. ఏలేశ్వరం మున్సిపాలిటీలో 28 వార్డులకు 34 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు, వాటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పరిశీలించామని అన్నారు.
అప్పనపల్లి బ్రిడ్జి క్రింది పోవడం వల్ల పోలింగ్ సిబ్బందికి ఇబ్బంది ఎదురవుతుందని తెలిపారని దానికి సంబంధించిన చర్యలు చేపడుతున్నామని అన్నారు. స్థానిక ఎన్నికల నేపద్యంలో ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసాద్ తెలిపారు.




