Kakinada: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి కలెక్టర్!

Kakinada: కాకినాడ జిల్లాలోని పిఠాపురం, గొల్లప్రోలు, పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీల్లో స్థానిక ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తనిఖీ చేశారు.

V. Ramakrishna, Pithapuram
Published on: 16 Oct 2026 4:22 PM IST
Kakinada
X

Kakinada: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి కలెక్టర్!

కాకినాడ: జిల్లాలో పురపాలక సంఘ (మున్సిపల్) ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా మరియు ప్రశాంత వాతావర ణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను అత్యంత పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

​శుక్రవారం ఆయన జిల్లాలోని పిఠాపురం, గొల్లప్రోలు, పెద్దా పురం, సామర్లకోట పురపాలక సంఘాల్లో విస్తృతంగా పర్య టించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ కోసం సిద్ధం చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలు మరియు స్ట్రాంగ్ రూముల ఏర్పాట్ల పనులను క్షేత్ర స్థాయిలో స్వయంగా తనిఖీ చేశారు.​

ఈ తనిఖీల సమయంలో ఎన్నికల సామగ్రి పంపిణీ పోలింగ్ పూర్తయిన తర్వాత సామగ్రి స్వీకరణ ఓట్ల లెక్కింపు అలాగే బ్యాలెట్ పెట్టెలు భద్రపరిచే స్ట్రాంగ్ రూముల వద్ద చేప ట్టాల్సిన భద్రతా చర్యలపై అధికారులతో సమీక్షించారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram