Gandepalli: గండేపల్లిలో కూటమి ప్రచారం: జ్యోతుల నెహ్రూ, తుమ్మలపల్లి రమేష్
Gandepalli: గండేపల్లి మండలంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జనసేన ఇన్చార్జ్ తుమ్మలపల్లి రమేష్ కూటమి జడ్పీటీసీ అభ్యర్థి లక్ష్మీ శ్రీనివాస్ తరఫున ముమ్మర ప్రచారం చేశారు.
Gandepalli: గండేపల్లిలో కూటమి ప్రచారం: జ్యోతుల నెహ్రూ, తుమ్మలపల్లి రమేష్
గండేపల్లి: జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలంలోని నీలాద్రిరావుపేట, తాళ్లూరు, మల్లేపల్లి, ఉప్పలపాడు, సుబ్బయ్యమ్మపేట గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తో కలిసి జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ పాల్గొని, జడ్పీటీసీ అభ్యర్థి మంగిన గల్లి లక్ష్మీ శ్రీనివాస్‌తో పాటు ఆయా గ్రామాల ఎంపీటీసీ అభ్యర్థుల విజయానికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కూటమి అభ్యర్థులను గెలిపించాలని, గ్రామాల అభివృద్ధికి ప్రజలు సహకరించాలని నాయకులు ఓటర్లను కోరారు.




