Kakinada: రేపటి రెండో దశ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి!

Kakinada: కిర్లంపూడి, జగ్గంపేట, గండేపల్లి మండలాల్లోని ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాలను కాకినాడ జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ తనిఖీ చేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

SATYANARAYANA, JAGGAMPETA
Published on: 28 Nov 2026 3:53 PM IST
Kakinada
X

Kakinada: రేపటి రెండో దశ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి!

Kakinada: జిల్లాలో రెండో దశ గ్రామపంచాయతీ ఎన్నికలను నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పేర్కొన్నారు.శనివారం జిల్లా జాయింట్ కలెక్టర్ కిర్లంపూడి, జగ్గంపేట, గండేపల్లి మండలాల్లో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సామాగ్రి పంపిణీ (డిస్ట్రిబ్యూషన్) కేంద్రాలను క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా సందర్శించి, ప్రక్రియ జరుగుతున్న తీరును నిశితంగా పరిశీలించారు.ముందుగా కిర్లంపూడి మండలంలోని శ్రీ సత్య దేవా కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు. అనంతరం జగ్గంపేటలోని డిగ్రీ కళాశాల ప్రాంగణంలోను, గండేపల్లి మండల ఎంపీడీవో కార్యాలయాల్లో కొనసాగుతున్న పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రక్రియను ఆయన స్వయంగా పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్దకు వెళ్లి, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఓటర్ల జాబితాలు, సిరా ఇతర ముఖ్యమైన ఎన్నికల సామాగ్రిని సిబ్బందికి అందజేస్తున్న విధానాన్ని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో జరగనున్న రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లే సిబ్బందికి సామాగ్రి పంపిణీ ప్రక్రియలో ఎటువంటి గందరగోళం, జాప్యం తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరించాలని అధికారులను జేసీ ఆదేశించారు.సిబ్బందికి కేటాయించిన రూట్ల వారీగా రవాణా సదుపాయాలు అందుబాటు లో ఉన్నాయా లేదా అని ఆరా తీశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తూ.చ. తప్పకుండా పాటిస్తూ, పోలింగ్ సిబ్బంది సకాలంలో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేసుకోవాలన్నారు. ఆదివారం జరగబోయే రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలింగ్ సిబ్బంది కృషి చేయాలని ఆయన జేసీ సూచించారు.పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన దగ్గర నుంచి కౌంటింగ్ ప్రక్రియ ముగిసేంతవరకు ప్రతి దశలోనూ పోలింగ్ సిబ్బంది అప్రమత్తతో వ్యవహరించాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ స్పష్టం చేశారుj ఎన్నికల విభాగపు సిబ్బంది పాల్గొన్నారు.

SATYANARAYANA, JAGGAMPETA

SATYANARAYANA, JAGGAMPETA