Kakinada: గొర్స, కొమరగిరిలో జనసేన పర్యటన!
Kakinada: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కొత్తపల్లి మండలంలో జనసేన నేతలు పర్యటించి, గండ్లు పడిన ప్రాంతాలను పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టారు.
Kakinada: గొర్స, కొమరగిరిలో జనసేన పర్యటన!
Kakinada: పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గొర్స, కొమరగిరి గ్రామాల్లో పలుచోట్ల చిన్న చిన్న గండ్లు పడటంతో గోదావరి డెల్టా చైర్మన్ మురాలశెట్టి సునీల్ తో కలిసి కొత్తపల్లి మండల జనసేన పార్టీ ఇంచార్జ్ రావు అక్షయ్ ఆ ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని పరిశీలించడం జరిగింది.
సాగరమాల రోడ్డు వద్ద ఏర్పడిన బ్లాకేజీలను పరిశీలించి, అవసరమైన ప్రాంతాల్లో శాండ్ బ్యాగ్స్ ఏర్పాటు చేయడంతో పాటు తక్షణ చర్యలు చేపట్టేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేయడం జరిగింది.
ఈ పర్యటనలో గ్రామ ఇన్‌చార్జ్‌లు లోవబాబు , శ్రీను , జనసేన నాయకులు మాజీ సర్పంచ్ గంధం అన్నవరం , నాగేంద్ర , మాజీ సర్పంచ్ వీరబాబు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.




