Kakinada: పిఠాపురం నియోజకవర్గంలో బగ్గుమన్న జనసేన వర్గపోరు!
Kakinada: కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలో భగ్గుమన్న జనసేన నాయకుల విభేదాలు. కోనపాపేటలో సమావేశమైన కీలక నేతలు.
Kakinada: పిఠాపురం నియోజకవర్గంలో బగ్గుమన్న జనసేన వర్గపోరు!
Kakinada: జనసేన నాయకులమధ్య విబేధాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం... కొత్తపల్లి మండలంలో జనసేన నాయకులు రెండు వర్గాలుగా చీలిపోవడంతో ఆదివారం కోనపాపేటలోని బుల్లబ్బాయు రెడ్డి కల్యాణ మండపంలో జనసేన పార్టీ కీలక నాయకులు సమావేశము జరిగింది.
ఈ సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకుడు వేగిశెట్టి సూర్య నిఖిల్ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేసిన జనసైనికులను మండల పార్టీ అధ్యక్షుడు దూరం పెడుతున్నారని ఆరోపించారు. పార్టీ కార్యాలయం పేరుతో కార్యకర్తలను తన వద్దకే రావాలని ఆదేశిస్తున్నారని, అన్నయ్య ఫొటోతో పాటు తన ఫొటో పెట్టుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు.
ఏదైనా ప్రశ్నిస్తే 'అన్నయ్య చెప్పాడు.. నేను చేస్తున్నాను' అంటూ మండలంలో ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోట్లాది రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. మండలంలో ఇదే విధమైన పరిస్థితులు కొనసాగితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తల మధ్య విభేదాలు ఏర్పడి పార్టీ విజయావకాశాలపై ప్రభావం పడే అవకాశం ఉందని అన్నారు.
ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్ది జనసైనికుల ఐక్యతతో స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. అంతర్గతంగా కొనసాగుతున్న విభేదాలను పరిష్కరించేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని నిఖిల్ విజ్ఞప్తి చేశారు.




