Jaggampeta: జగ్గంపేట జెడ్పీటీసీ మణిబాబుకు పెన్షనర్ల ఘన సన్మానం!
Jaggampeta: కాకినాడ జిల్లా జగ్గంపేట జెడ్పీటీసీ జీను మణిబాబును పెన్షనర్ల సంఘం ఘనంగా సన్మానించింది. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఆయన తెలిపారు.
Jaggampeta: జగ్గంపేట జెడ్పీటీసీ మణిబాబుకు పెన్షనర్ల ఘన సన్మానం!
జగ్గంపేట: స్థానిక జే.వి.ఆర్ కాంప్లెక్స్ నందు జడ్పిటిసి సభ్యులు జీను మణి బాబును జగ్గంపేట పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు తోలేటి సూర్యనారాయణ నాయకత్వంలో ఘనంగా సన్మానించిరి. ఈ సందర్భంగా ప్రధాని కార్యదర్శి ఎం మల్లేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాల పట్ల వ్యతిరేకతతో ఎన్నికలకు ముందే మా పెన్షన్ల సంఘం మద్దతు ప్రకటించామని, నేడు జరిగిన ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పరిశీలనతో ఉద్యోగస్తులు పెంక్షనర్లు ప్రభుత్వం వైపు మొగ్గు చూపారని తెలిపిరి.
జడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికలలో సింహాద్రిపురం నందు మా పోస్టల్ బ్యాలెట్ ఫలితం కారణంగానే సింహాద్రిపురం ఎంపీటీసీ ఎన్నిక కావడం దేనికి నిదర్శనమని అధ్యక్షులు తోలేటి సూర్యనారాయణ పేర్కొన్నారు. అనంతరం జడ్పిటిసి జీను మన బాబు ను దుశ్శాలు వాలతో , పూలమాల తో ఘనంగా సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిరి.
ఈ సందర్భంగా జడ్పిటిసి జీను మణి బాబు మాట్లాడుతూ మీ అందరూ సహకారం వల్లే నేను అత్యధిక మెజారిటీ తో విజయం సాధించానని ఈ విధమైన సంఘీభావం భవిష్యత్తులో కూడా చూపించాలని , మీకు ఏ సమస్య వచ్చిన నా దృష్టి కి తీసుకొని వస్తే పరిష్కరిస్తానని తెలిపిరి. ఈ విధంగా సీనియర్ సిటిజన్స్ అంతా వచ్చి నాకు అభినందనలు తెలియజేయడం చాలా సంతోషం గా ఉందని తెలిపిరి.
ఈ కార్యక్రమంలో హెచ్ వి ఆర్ జ్యోషి , టి జె.స్వామి , పి బాబురావు ,పి. సూర్యనారాయణ , దామెర భాస్కర్ రావు , గోన చక్ర రావు , ఎం రామలింగేశ్వర రావు , సిహెచ్ సత్యనారాయణ , ఎం.వెంకటేశ్వరరావు , సలాది వెంకటేశ్వరరావు , సి.హెచ్. సూర్యప్రకాశరావు , లివింగ్ స్టన్ , గంగాధర్ , ఎయిడెడ్ మూర్తి , పడాల వీర వెంకట సత్యనారాయణ , ఇల్ల బుద్దాజీ , కే జే. సాల్మన్ రాజు , పాప రాజు , ఎన్. సత్యనారాయణమూర్తి , ఎర్రంశెట్టి రాజబాబు తదితరు పెన్షనర్స్ పాల్గొన్నారు.




