Jaggampeta: కాట్రావులపల్లిలో రూ.40 లక్షలతో తాగునీటి సంపు ప్రారంభం
Jaggampeta: కాట్రావులపల్లిలో రూ.40 లక్షలతో నిర్మించిన తాగునీటి సంపు, పైప్‌లైన్‌ను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించి, గ్రామ అభివృద్ధిని కొనియాడారు.
Jaggampeta: కాట్రావులపల్లిలో రూ.40 లక్షలతో తాగునీటి సంపు ప్రారంభం
జగ్గంపేట: జగ్గంపేట నియోజకవర్గం, జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామ పంచాయతీలో పల్లె పండుగ 3.0 మహా సంబరంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ పర్యవేక్షణలో గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ముసిరెడ్డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నూతన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.
గ్రామంలో రక్షిత మంచినీటి పథకం కింద జి.పి & జడ్.పి.పి ఫండ్స్ నిధులు రూ. 40.00 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన 2 లక్షల 50 వేల లీటర్ల సామర్థ్యం గల త్రాగునీటి సంపు & పైప్ లైన్ నిర్మాణము మరియు గ్రామీణ త్రాగునీటి సరఫరాకు సంబంధించిన విద్యుత్ 4 పోల్ స్ట్రక్చర్ ను జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పల్లె పండుగ 3.0 ద్వారా ప్రతి గ్రామంలో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతోందని, కాట్రావులపల్లి ప్రజల చిరకాల కోరిక అయిన మంచినీటి సంపును 40 లక్షలతో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు.
మీ నాయకుడు ముసిరెడ్డి నాగేశ్వరరావు గ్రామ అభివృద్ధికి నిరంతరం పనిచేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని అటువంటి నాయకుడిని మీరు ఎవరో వదులుకోవద్దు అని అన్నారు. రాబోయే రోజుల్లో కాట్రావులపల్లి గ్రామంలో నాగేశ్వరరావు కోరిన అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని జ్యోతుల నెహ్రూ తెలిపారు.
అనంతరం కాట్రావులపల్లి గ్రామానికి అత్యధిక నిధులతో అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను ముసిరెడ్డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తానే స్వయంగా రాసిన సన్మాన పత్రాన్ని చదివించి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో అడప భరత్, జీను మణి బాబు,ఎస్వీఎస్ అప్పలరాజు, కొత్త కొండబాబు, మారిశెట్టి భద్రం, దేవరపల్లి మూర్తి, పాలచర్ల నాగేంద్ర చౌదరి, పాండ్రంగి రాంబాబు,రేఖ బుల్లి రాజు, గెద్దాడ సత్యవేణి, దాసరి సీతారామకృష్ణ,సుంకర సీతారామయ్య, రాయుడు శివప్రసాద్, కంటే రామారావు,
పప్పు గణేశ్వరరావు,బిక్కిన బాబి,పోలినాటిధర్మానందకుమారి శాస్త్రి,వేమగిరి రాజు,సుంకర శ్రీనివాస్, ఎల్లాటి అమ్మాజీ, గుండుపల్లి సుజాత, లంక సత్తిరాజు,ఎమ్మార్వో జేవియర్ రమేష్, ఆర్డబ్ల్యూఎస్ జెఈ రాంజీ తదితరులు పాల్గొన్నారు.




