Jaggampeta: ఘనంగా కిసాన్ మేళా 2026 ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

Jaggampeta: జగ్గంపేటలో కిసాన్ మేళా 2026 ఘనంగా నిర్వహించారు. రైతులు ప్రకృతి వ్యవసాయం చేయాలని, పంటల బీమా తప్పనిసరిగా చేయించుకోవాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోరారు.

SATYANARAYANA, JAGGAMPETA
Published on: 7 Oct 2026 6:00 PM IST
Jaggampeta
X

Jaggampeta: ఘనంగా కిసాన్ మేళా 2026 ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

జగ్గంపేట: జగ్గంపేట కాపు కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వ్యవసాయ శాఖ, కాకినాడ జిల్లా వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో కిసాన్ మేళా 2026 కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆహ్వానితులందరికీ ఘన స్వాగతం పలికి, రైతులకు పలు అంశాలపై సూచనలు సలహాలు అందజేసిన వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గరిమెళ్ళ శ్రీనివాస్ అనంతరం వ్యవసాయం, అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలలను పరిశీలించారు. ఆధునిక పరికరాలు, నూతన వంగడాలు, ప్రకృతి ఎరువుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా అనేక పంటలు పండించాలని, ప్రతి రైతు పంటల బీమా తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావం ఉన్నందున ఆరుతడి పంటలు వేసుకోవాలని, రసాయన ఎరువులు తగ్గించి ప్రకృతి వ్యవసాయం చేయాలని, మూడు పంటలకు ఒకసారి విత్తన మార్పిడి చేయాలని కోరారు. అన్నదాత సుఖీభవ ద్వారా జగ్గంపేట నియోజకవర్గంలోనే 71 కోట్ల 94 లక్షలు రైతులకు అందించామని, సహకార రుణాలకు వన్ టైం సెటిల్మెంట్ త్వరలో తీసుకొస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:

మార్కెట్ కమిటీ చైర్మన్ అడప భరత్, ఆత్మ కమిటీ చైర్మన్ పైడిపాల సూరిబాబు, రాష్ట్ర డైరెక్టర్లు పోతుల మోహనరావు, కొత్త కొండబాబు, జీను మణిబాబు, ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, దేవరపల్లి మూర్తి, సొసైటీ చైర్మన్ లు, బుర్రి సత్తిబాబు, ఉప్పలపాటి బుల్లెబ్బు, కంటిపూడి సత్యనారాయణ, కందుల కొండయ్య చౌదరి, దిడ్డి శ్రీను, టిడిపి, జనసేన, బిజెపి కూటమి నాయకులు, ఆత్మ జిల్లా పిడి రాబర్ట్ పాల్, ప్రకృతి వ్యవసాయ జిల్లా మేనేజర్ ఎలియాజర్, ఏడిహెచ్ రామస్వామి, డిహెచ్ఓ సిరిల్, ఏపిడి ఏపిఎంఐపి ప్రసాద్, ఏడిఏ బిసిఎల్ రత్నా ప్రశాంతి, పెద్దాపురం, మార్టేరు శాస్త్రవేత్తలు రామభద్ర రాజు , నరసింహారావు, పెద్దాపురం ఉద్యాన శాస్త్రవేత్త సునీత, పెద్దాపురం ఏడిఏ దయకుమార్, రాజమండ్రి వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ సునీత, శంఖవరం, జగ్గంపేట, తుని, గండేపల్లి, ఏలేశ్వరం, కిర్లంపూడి వ్యవసాయాధికారులు, ఏలేశ్వరం, జగ్గంపేట ఉద్యానవన శాఖ అధికారులు, విఏఏలు, విహెచ్ఏలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

SATYANARAYANA, JAGGAMPETA

SATYANARAYANA, JAGGAMPETA