Jaggampeta: రైతులకు రాజముద్ర పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
Jaggampeta: జగ్గంపేట మండలంలో రైతన్నలకు రాజముద్ర పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పంపిణీ చేశారు. ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
Jaggampeta: రైతులకు రాజముద్ర పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
జగ్గంపేట: జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మీ భూమి - మీ హక్కు రాజముద్ర పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. మర్రిపాక655, బలభద్రపురం400, జె.కొత్తూరు శివారు టి.ఆర్. పేట 386 రైతులకు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గత ప్రభుత్వం తమ ఫోటోలతో పాస్ పుస్తకాలు పంపిణీ చేసిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భూ యజమాని ఫోటో, రాజముద్రతో కూడిన శాశ్వత పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు.
గతంలో తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో రైతులను ఇబ్బందులకు గురిచేసిన గొడ్డలి పార్టీ చేసిన అన్యాయం నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామని, రీ-సర్వే ద్వారా రైతుల భూములకు న్యాయం చేస్తున్నామని అన్నారు.
ప్రతి రైతు తన ఇంటి వద్ద పశుపోషణ చేపట్టాలని, రసాయన ఎరువులు తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని, వాణిజ్య పంటలు వేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, ఎస్ వి ఎస్ అప్పలరాజు, ఎమ్మార్వో జేవియర్ రమేష్, ఆర్ ఐ జి మంగపతి నాయుడు బాబు, గద్దె మారుతి, కాపువరపు ప్రకాశం, మాజీ సర్పంచ్ బండారు చిన్నయ్య, మాజీ ఎంపీటీసీ పైలా శివరామకృష్ణ, చింతల కన్నారావు, అడపా మైనర్, గూడుపు నాగేశ్వరరావు, మండల అధికారులు, కూటమి నాయకులు, నాలుగు గ్రామాల రైతులు పాల్గొన్నారు.




