Jaggampeta: జగ్గంపేటలో కూటమి సీట్ల సర్దుబాటు పూర్తి: జ్యోతుల నెహ్రూ!
Jaggampeta: జగ్గంపేట నియోజకవర్గంలో కూటమి స్థానిక సంస్థల సీట్ల సర్దుబాటు పూర్తయిందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వెల్లడించారు.
Jaggampeta: జగ్గంపేటలో కూటమి సీట్ల సర్దుబాటు పూర్తి: జ్యోతుల నెహ్రూ!
జగ్గంపేట: స్థానిక రావులమ్మ నగర్ లోని టిడిపి కార్యాలయంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నియోజకవర్గం స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకులు అమలాపురం రూరల్ డెవలప్మెంట్ చైర్మన్ అల్లాడ స్వామి నాయుడుతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు చెప్పాం చేస్తున్నాం అనే నినాదంతో గడిచిన రెండున్నర సంవత్సరాలలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల సంగ్రామానికి వెళ్తున్నామని అన్నారు. ముఖ్యంగా కూటమి పార్టీలు ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఆయా పార్టీల్లో కష్టపడుతూ సేవా దృక్పథంతో పనిచేస్తూ ప్రజల్లో మంచి పేరున్న నాయకులకు కూడా రిజర్వేషన్ల ప్రక్రియ వల్ల కొన్ని సీట్లు కూటమి పార్టీల వల్ల కొన్ని సీట్లు త్యాగం చేయవలసి వచ్చిందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని విధాల సహకరించిన జనసేన ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్ కు నాయకులకు బిజెపి నాయకులకు టిడిపి నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.
జగ్గంపేట నియోజకవర్గంలో 80 ఎంపీటీసీ స్థానాలకు గాను జనసేనకు 15 బిజెపికి 2 తెలుగుదేశం పార్టీ 63 స్థానాల్లో అభ్యర్థులను పోటీ చేయించడం జరుగుతుందని అదేవిధంగా నియోజకవర్గంలోని 4 జడ్పిటిసి స్థానాలకు గాను మూడు జడ్పిటిసి స్థానాలు టిడిపికి 1 జడ్పిటిసి గండేపల్లి జనసేనకు కేటాయించడం జరిగిందని అన్నారు. జగ్గంపేట నుండి జీను మణిబాబు కిర్లంపూడి నుండి తోట రవి గోకవరం నుండి డాక్టర్ టీనా కేర్లిన్ జనసేన నుంచి గండేపల్లి నుండి మంగిన గని లక్ష్మి పోటీ చేస్తున్నారని అన్నారు.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీలు తమ సత్తాను నిలబెట్టుకోవడానికి పోటీ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కావాలని కానీ జగన్ ప్రజల్లో ఇమేజ్ లేక స్థానిక సంస్థల ఎన్నికలను ఏదో విధంగా నిలుపుదల చేయాలని ప్రయత్నిస్తున్నారని దానికి కోర్టులకు వెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. గత వైసిపి ప్రభుత్వంలో స్థానిక సంస్థలను ఏ విధంగా నిర్వహించారో ప్రజలకు తెలిసిందని స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే కేంద్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం ప్రకారం గ్రామాలకు నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తుందని గ్రామాలు అభివృద్ధి చెందడం జగన్మోహన్రెడ్డికి ఇష్టం లేకనే ఇలా చేస్తున్నారని అన్నారు.
అబ్జర్వర్ అల్లాడ స్వామి నాయుడు మాట్లాడుతూ 80 ఎంపీటీసీ స్థానాలు నాలుగు ఎంపీపీ నాలుగు జడ్పిటిసి స్థానాలకు కూటమిలో అభ్యర్థులను నిలబెట్టడం చాలా కష్టమని సీనియార్టీ గల జ్యోతుల నెహ్రూ ఎక్కడా పొరపొచ్చాలకు పోకుండా అందరికీ ఆమోదయోగ్యంగా అభ్యర్థులను ఎంపిక చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో, అడపా భరత్, కన్నబాబు, ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, ఎస్ వి ఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కందుల చిట్టిబాబు, ఘాజింగం సత్తిబాబు, కొత్తపల్లి బాబు, తదితరులు పాల్గొన్నారు.




