Kirlampudi: కిర్లంపూడిలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

Kirlampudi: కిర్లంపూడిలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేయాలని నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పిలుపు.

SATYANARAYANA, JAGGAMPETA
Published on: 13 Oct 2026 7:23 PM IST
Kirlampudi
X

Kirlampudi: కిర్లంపూడిలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

కిర్లంపూడి: జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండల కేంద్రంలోని తోట గోపాలకృష్ణ కళ్యాణమండపంలో మండల జనసైనికుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ, జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ బలంగా ఉందని, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జనసైనికులకు పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సూచించిన విధంగా పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని పేర్కొన్నారు. జనసేన తరఫున పోటీ చేసే అభ్యర్థుల విజయానికి పార్టీ నాయకులు, జనసైనికులు సమష్టిగా కృషి చేయాలని కోరారు.

అదేవిధంగా కూటమి పార్టీల అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో జనసేన శ్రేణులు పూర్తి సహకారం అందిస్తూ, కూటమి సమన్వయంతో ముందుకు సాగాలని తెలిపారు.

ఈ సందర్భంగా కిర్లంపూడి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన జనసైనికులతో ప్రత్యేకంగా సమావేశమైన తుమ్మలపల్లి రమేష్, ఆయా గ్రామాల్లో పార్టీ బలం, కూటమి పార్టీల మధ్య సమన్వయం, స్థానిక రాజకీయ పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామాల వారీగా సమన్వయంతో ముందుకు సాగాలని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు.

ఈ సమావేశంలో కాకినాడ పార్లమెంట్ నిర్వహణ సభ్యులు, జగ్గంపేట నియోజకవర్గ సమన్వయకర్తలు, నిర్వహణదళ సభ్యులు, సపోర్టింగ్ సభ్యులు పాల్గొని సమావేశానికి తమ సూచనలు, సలహాలు అందించారు. కిర్లంపూడి మండల జనసైనికులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ నిర్వహణ దళ్ సభ్యులు మేబోబోయిన శ్రీను, జిల్లా సంయుక్త కార్యదర్శి సూరంపాలెం బాలు,సపోర్టింగ్ టీం సభ్యులు మండపాక శివ, స్థానిక సంస్థల కోఆర్డినేషన్ కమిటీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు గవర సుధాకర్, చల్లా రాజ్యలక్ష్మి,ఐటీ కో ఆర్డినేటర్ అరినే రాజేష్,కిర్లంపూడి జనసేన నాయకులు చదలవాడ బాబి, కిర్లంపూడి మండలం అధ్యక్షుడు గంధం ప్రభాకర్, దాడిచిన బుజ్జి, రాజుపాలెం జనసేన నాయకులు జోకా శ్రీను, తామరాడ ఎంపీటీసీ గోకేడ రాజా, అసెంబ్లీ నియోజకవర్గ నిర్వహణదళ్ సభ్యులు మాదారపు వీరబాబు,కురుమల్ల నాగేశ్వరరావు, వేణుమ్ రాంబాబు, వాసిరెడ్డి శ్రీను,అరినే అంబికా,మహిపాలా గణేష్,మేడిబోయిన గంగాధర్,నాగబోయిన శివ, ఎల్ వి వి సత్యనారాయణ, బూరుగుపూడి నాయకులు పాఠంశెట్టి రమేష్,వేలంక జనసేన నాయకుడు ఎలుబండి శివ,పాలెం బాబీ,కుంచె రాజు, తుంగపల్లి గోవింద్, కాయల మణికంఠ,మడుగుల బాబ్జి, గోకేడ ప్రసాద్,బోండా నంది బాబు, చిక్కాల భగవాన్, అంకం ఓం, ఆకుల నవీన్,అంకం వీరబాబు,పప్పల సతీష్,జువ్వల సీను,తదితరులు పాల్గొన్నారు.

SATYANARAYANA, JAGGAMPETA

SATYANARAYANA, JAGGAMPETA