Jaggampeta: జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను కలిసిన జనసేన విజేతలు

Jaggampeta: జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను మర్యాదపూర్వకంగా కలిసిన గండేపల్లి జెడ్పీటీసీ మంగిన గని లక్ష్మి శ్రీనివాస్, నియోజకవర్గ జనసేన ఎంపీటీసీ విజేతలు.

SATYANARAYANA, JAGGAMPETA
Published on: 9 Nov 2026 8:14 PM IST
Jaggampeta
X

Jaggampeta: జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను కలిసిన జనసేన విజేతలు

జగ్గంపేట: జగ్గంపేట రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో సందడి నెలకొంది.

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున గండేపల్లి జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన మంగిన గని లక్ష్మి శ్రీనివాస్ తో పాటు జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి, గోకవరం మండలాల నుండి జనసేన పార్టీ తరపున ఎంపీటీసీలుగా ఘన విజయం సాధించిన వారందరినీ తీసుకుని తుమ్మలపల్లి రమేష్ జగ్గంపేట శాసనసభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ ని మర్యాదపూర్వకంగా కలిశారు.

విజేతలందరినీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేరుపేరునా పలకరించి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు మాట్లాడుతూఈ విజయానికి ప్రధాన కారణం కూటమి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు నేతల ఐక్యత.

తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా కష్టపడి పనిచేయడం వల్లే కూటమి అభ్యర్థులందరూ అఖండ మెజారిటీతో గెలిచారు.ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో గ్రామాల అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి మీరు ముందుండాలి. మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి నిజమైన ప్రజా పరిపాలన అందించాలి.

గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా నేరుగా నా దృష్టికి తీసుకురండి, వాటి పరిష్కారానికి నా వంతు కృషి చేస్తాను"* అని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

SATYANARAYANA, JAGGAMPETA

SATYANARAYANA, JAGGAMPETA