Jaggampeta: ఘనంగా అంతర్జాతీయ అధ్యాపక దినోత్సవ వేడుకలు
Jaggampeta: జగ్గంపేటలో కేఎస్‌ఎన్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో అంతర్జాతీయ అధ్యాపక దినోత్సవం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Jaggampeta: ఘనంగా అంతర్జాతీయ అధ్యాపక దినోత్సవ వేడుకలు
జగ్గంపేట: సమాజ నిర్మాణంలో అధ్యాపక వృత్తి ఎంతో కీలకమైనదని జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ పాలకవర్గ సభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పోలీట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు.కె ఎస్ ఎన్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో అంతర్జాతీయ అధ్యాపక దినోత్సవం పురస్కరించుకొని జగపతినగరంలోని సరయు ఫంక్షన్ హాల్ లో అధ్యాపక దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సమాజ నిర్మాణానికి అధ్యాపక వృత్తి ఎంతో కీలకమైనదని, విద్యతోపాటు స్కిల్ డెవలప్మెంట్ కోర్సు ప్రతి విద్యార్థి నేర్చుకునే విధంగా అధ్యాపకులు కృషి చేయాలన్నారు. విశిష్ట అతిధిగా విచ్చేసిన రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు పూల విక్రమ్ కుమార్ మాట్లాడుతూ అధ్యాపక వృత్తి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
భవిష్యత్ తరాలను మరింత విద్యావంతులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించాలని అధ్యాపకులను కోరారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు భోగాది వెంకట రాయుడును విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి మెమొంటోలు అందజేశారు.
ప్రముఖ సామాజికవేత్త గోకేడ రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, రిటైర్డ్ ఎడిషనల్ ఎస్పీ, ఎన్ బి ఎం మురళీకృష్ణ, అత్తిలి సీతారామస్వామి, యువ నాయకులు తోట వరుణ్, కన్నబాబు,సత్యానందం, కళాశాల కళాశాల కరస్పాండెంట్ కె.వి కుమారి, డైరెక్టర్ పి శ్రీను, ఏఓ,జె వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ రాధా కృష్ణ, ఏఓ అర్జున్, శ్రీరామ్, కళాశాల సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




