Jaggampeta: 'అర్నాబ్' తుఫాన్ వరద బీభత్సం – జ్యోతుల నవీన్ పర్యటన!

Jaggampeta: అర్నాబ్ తుఫాన్ ధాటికి జగ్గంపేటలో వరద ఉధృతి. బాధిత ప్రాంతాల్లో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ పర్యటన. ముమ్మరంగా డ్రైనేజీ పూడికతీత.

SATYANARAYANA, JAGGAMPETA
Published on: 28 Oct 2026 4:32 PM IST
Jaggampeta
X

Jaggampeta: 'అర్నాబ్' తుఫాన్ వరద బీభత్సం – జ్యోతుల నవీన్ పర్యటన!

జగ్గంపేట: అర్నబ్ తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు జగ్గంపేటలో వరద నీరు పోటెత్తింది. జగ్గంపేట ఎస్సీ కాలనీ, దేవి సెంటర్ ఎదురుగా, పేకేటి వీరమ్మ చెరువు కాలువ తదితర ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి.

వరద పరిస్థితిని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ప్రత్యక్షంగా పరిశీలించారు. వరదలో చిక్కుకున్న ప్రాంతాల్లో కలియతిరిగి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

వెంటనే పంచాయతీ కార్మికులు ట్రాక్టర్ల సహాయంతో డ్రైనేజీలలో పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. మురుగునీరు, వర్షపు నీరు బయటకు వెళ్లే విధంగా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టించారు.

వరద నీటిలో మునిగిపోయిన బాధిత కుటుంబాలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని పంచాయతీ అధికారులకు, నాయకులకు జ్యోతుల నవీన్ ఆదేశాలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు, టిడిపి జడ్పిటిసి అభ్యర్థి జీను మణిబాబు, జగ్గంపేట టిడిపి అధ్యక్షులు పాండ్రంగి రాంబాబు, రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, పీలా మహేష్, బోండా రాజేష్, మారిశెట్టి గంగ, కోడూరి రమేష్, సాంబత్తుల చంద్రశేఖర్, తుమ్మల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

SATYANARAYANA, JAGGAMPETA

SATYANARAYANA, JAGGAMPETA