Jaggampeta: వీఆర్ఏల నిరసనకు కాంగ్రెస్ ఇంచార్జ్ మరోతి శివగణేష్ మద్దతు
Jaggampeta: జగ్గంపేటలో గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ ఇంచార్జ్ మరోతి శివగణేష్, 17 రోజులుగా నిరసన తెలుపుతున్న వీఆర్ఏలకు మద్దతు ప్రకటించారు.
Jaggampeta: వీఆర్ఏల నిరసనకు కాంగ్రెస్ ఇంచార్జ్ మరోతి శివగణేష్ మద్దతు
జగ్గంపేట: భారత దేశ స్వాతంత్ర సాధకుడు మహాత్మా గాంధీజీ 157 వ జయంతి సందర్భంగా స్థానిక జగ్గంపేట తాసిల్దార్ కార్యాలయంలో గల గాంధీజీ విగ్రహానికి జగ్గంపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మరోతి శివగణేష్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు అలంకరించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా శివ గణేష్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర సాధన కోసం మహాత్మా గాంధీ అహింసా మార్గంలో చేసిన కృషిని త్యాగాన్ని కొనియాడారు. భారతదేశానికి స్వాతంత్రం సాధించిన మహాత్మా గాంధీజీని హత్య చేసిన గాడ్సే వారసులు ఆర్ఎస్ఎస్ మరియు బిజెపి చేతిలో భారతదేశం బానిసగా మారిందని, తిరోగమన దిశలో ప్రయాణిస్తుందని బిజెపి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.
అదే తాసిల్దార్ కార్యాలయంలో 17 రోజుల నుండి వారి న్యాయమైన కోరికలు తీర్చాలని పిఎసి అమలు చేయాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, పీఏసీ చట్టం ప్రకారం కనీస వేతనాలు సమకూరే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గ్రామ రెవెన్యూ సేవకులు(VRA) చేస్తున్న నిరసన కార్యక్రమానికి జగ్గంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మరోతి శివ గణేష్ మద్దతు తెలియజేశారు.
ఈ సందర్భంగా శివ గణేష్ మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సేవకుల న్యాయమైన కోరికలు ప్రభుత్వం తీర్చాలని లేనిపక్షంలో బాధితుల తరఫున కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి వారి డిమాండ్లు నెరవేరేవరకు వారికి తోడుగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని, అవసరమైతే వారికోసం ఆమరణ నిరాహార దీక్ష చేసే దానికి వెనుకాడ బోనని శివ గణేష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకులు గొంపా కొండబాబు, కాకినాడ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి జో చైతన్యకుమార్ తదితరులు పాల్గొన్నారు.




