Jaggampeta: లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

Jaggampeta: జగ్గంపేట మండలంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మరీ రూ.4.51 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను జ్యోతుల నవీన్ అందజేసి, పేదలకు అండగా ఉంటామని తెలిపారు.

SATYANARAYANA, JAGGAMPETA
Published on: 6 Oct 2026 5:08 PM IST
Jaggampeta
X

Jaggampeta: లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

జగ్గంపేట: జగ్గంపేట మండలంలో మంగళవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ లబ్దిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి చెక్కులు అందజేశారు.

మొత్తం 7 గ్రామాల్లో 8 చెక్కులు, మొత్తం రూ. 4,51,765 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. మర్రిపాక గ్రామంలో 1 చెక్ రూ. 43,795, జగ్గంపేటలో 1 చెక్ రూ. 36,289, కొత్తూరులో 1 చెక్ రూ. 30,000, రాజపూడిలో 1 చెక్ రూ. 1,77,841, మల్లిసాలలో 1 చెక్ రూ. 41,084, సీతానగరంలో 1 చెక్ రూ. 57,019, కాట్రావులపల్లిలో 2 చెక్కులు రూ. 65,737 లను అందజేశారు

ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పార్టీలకు అతీతంగా అనారోగ్యంతో బాధపడుతు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ ఆర్థిక సాయం అందజేయడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జీను మణిబాబు, మారిశెట్టి భద్రం, పైడిపాల సూరిబాబు, పాండ్రంగి రాంబాబు, అడబాల వెంకటేశ్వరరావు, రేఖ బుల్లి రాజు, ముసిరెడ్డి నాగేశ్వరరావు, సర్వసిద్ధి లక్ష్మణరావు, ముండ్రు ఎర్రబాబు, రాయి సాయి, పీలా మహేష్, ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

SATYANARAYANA, JAGGAMPETA

SATYANARAYANA, JAGGAMPETA