Tuni: తునిలో భారీగా గంజాయి పట్టివేత: నలుగురు అరెస్ట్

Tuni: తుని సీతారాంపురంలో ఓ ఇంటిని అడ్డాగా చేసుకుని గంజాయి రవాణా చేస్తున్న నలుగురిని అరెస్ట్ చేసి, రూ.62.5 లక్షల విలువైన 125 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

MANIKANTA, TUNI
Published on: 17 Sept 2026 7:59 PM IST
Tuni
X

Tuni: తునిలో భారీగా గంజాయి పట్టివేత: నలుగురు అరెస్ట్

తుని: కాకినాడ జిల్లా తుని పట్టణంలో భారీగా గంజాయి రవాణా గుట్టు రట్టయింది. సీతారాంపురం ప్రాంతంలో ఒక ఇంటిని అడ్డాగా చేసుకొని గంజాయి రవాణాకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను తుని పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల వద్ద నుంచి 125 కేజీల గంజాయితో పాటు రూ.3 లక్షల 41 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.62 లక్షల 50 వేలుగా పోలీసులు అంచనా వేశారు.

గంజాయి రవాణాకు ఉపయోగించిన ఒక ఎర్టిగా కారు, ఒక ఆటోతో పాటు రెండు మోటార్ సైకిళ్లను పోలీసులు సీజ్ చేశారు.

ఈ ఘటనపై కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో కేసు నమోదు చేసిన పోలీసులు.. కేసు వివరాలను పెద్దాపురం డి.ఎస్.పి తిలక్ మీడియాకు వివరించారు.

గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడికి తరలిస్తున్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI