Tuni: HMTV కథనానికి స్పందన తునిలో మ్యాన్ హోల్‌కు మోక్షం!
Tuni: తునిలో ప్రమాదకరంగా మారిన మ్యాన్ హోల్‌పై HMTV కథనానికి స్పందన.. కొత్త మూత ఏర్పాటు చేయడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు.
Tuni: HMTV కథనానికి స్పందన తునిలో మ్యాన్ హోల్‌కు మోక్షం!
Tuni: కాకినాడ జిల్లా తుని పట్టణంలోని పాత బజార్ వీధి నుంచి కొబ్బరి తోటకి వెళ్లే మార్గంలో ప్రమాదకరంగా మారిన మ్యాన్ హోల్ ఉదంతంపై HMTVలో ప్రసారమైన కథనానికి ఎట్టకేలకు అధికారులు స్పందించారు.
ప్రయాణికులు, చిన్న పిల్లలు, వృద్ధులు నిత్యం ప్రాణభయంతో ప్రయాణిస్తున్న వైనంపై వెలువడిన వార్త స్థానిక యంత్రాంగంలో కదలిక తెచ్చింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆ మ్యాన్ హోల్ వద్దకు చేరుకుని, తెరుచుకుని ఉన్న గుంతకు పటిష్టమైన కొత్త మూతను (స్లాబ్) ఏర్పాటు చేశారు.
ప్రజల హర్షం - HMTVకి కృతజ్ఞతలు
మ్యాన్ హోల్‌కు మూత లేకపోవడంతో రాత్రివేళల్లో వాహనదారులు అందులో పడి గాయపడుతున్న దుస్థితికి తాజాగా తెరపడింది. ఎటువంటి ప్రాణాపాయం జరగకముందే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించడం పట్ల స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను వెలుగులోకి తెచ్చి ప్రజల ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషించిన HMTV మీడియాకు మరియు స్పందించిన అధికారులకు ఈ సందర్భంగా ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.




