Tuni: తునిలో అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Tuni: తునిలో శ్రీ వంశోధ్దారక వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ విప్ యనమల దివ్య స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

MANIKANTA, TUNI
Published on: 10 Oct 2026 4:01 PM IST
Tuni
X

Tuni: తునిలో అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తుని: తుని పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ వంశోధ్దారక వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పరిసరాలు అశేష భక్తవాహిని గోవింద నామస్మరణతో మార్మోగాయి. భక్తిశ్రద్ధల మధ్య ఈనెల 20వ తేదీ వరకు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

తొలి రోజున ప్రభుత్వ విప్ యనమల దివ్య శ్రీనివాసుని దర్శించుకుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ గావించారు. ఆలయానికి విచ్చేసిన ప్రభుత్వ విప్ యనమల దివ్యకు దేవస్థానం చైర్మన్ కుక్కడపు బాలాజీ, ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు.

అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి బ్రహ్మోత్సవాలను ప్రారంభించిన యనమల దివ్య, స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవదేవున్ని దర్శించుకున్న ఆమె తీర్థప్రసాదాలు స్వీకరించి, పండితుల నుంచి వేదాశీర్వాదం పొందారు.

ఈ బ్రహ్మోత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, సీనియర్ నేతలు యనమల రాజేష్, మోతుకూరి వెంకటేష్, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు యినుగంటి సత్యనారాయణ, టౌన్ టీడీపీ అధ్యక్షురాలు కుసుమంచి శోభారాణి సత్యనారాయణ, గవర కార్పొరేషన్ డైరెక్టర్ మల్ల గణేష్, టౌన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి సూరంపూడి చంద్రశేఖర్, కూటమి నాయకులు వెలుగుల గోపాలకృష్ణ, కె.రామకృష్ణ, పరవాడ తాతబాబు, డాక్టర్ వెలగా వెంకట కృష్ణారావు, కుండల రామకృష్ణ, కారుమూరి భద్రరావు, జనసేన నాయకుడు బోణం చినబాబు తదితరులు శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI