Gandepalli: ఇంటింటికీ వెళ్లి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేసిన నవీన్

Gandepalli: గండేపల్లి మండలంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఇంటింటికీ వెళ్లి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేశారు. పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం భరోసా.

SATYANARAYANA, JAGGAMPETA
Published on: 8 Oct 2026 9:15 PM IST
Gandepalli
X

Gandepalli: ఇంటింటికీ వెళ్లి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేసిన నవీన్

గండేపల్లి: గండేపల్లి మండలంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం మానవీయతకు అద్దం పట్టేలా సాగింది. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల యోగక్షేమాలు, ఆరోగ్య పరిస్థితిని ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు.

మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో ఇద్దరికి రూ.1,90,517, మల్లేపల్లిలో ముగ్గురికి రూ.53,860, సురంపాలెంలో ఏడుగురికి రూ.4,40,792, పి. నాయకంపాలెంలో ఇద్దరికి రూ.1,76,363, తాళ్లూరులో ఒకరికి రూ.98,117, మురారిలో ఒకరికి రూ.16,795 చొప్పున చెక్కులను అందజేశారు. మొత్తం ఆరు గ్రామాలకు చెందిన 16 మంది లబ్ధిదారులకు రూ.9,76,444 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి కొండంత భరోసాగా నిలుస్తోందన్నారు. ఒకవైపు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తూనే, మరోవైపు అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకుంటున్నామని తెలిపారు.

జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి సహాయనిధి అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజల కష్టాల్లో వారికి అండగా నిలవడమే తమ ధ్యేయమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేర్చడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహనరావు, జిల్లా టీడీపీ కార్యాలయ కార్యదర్శి కోర్పు సాయి తేజ, పుష్కర ప్రాజెక్టు కమిటీ చైర్మన్ అడబాల భాస్కరరావు, గండేపల్లి మండల మాజీ వైస్ ఎంపీపీ కుంచె రాజా, క్లస్టర్ ఇన్‌చార్జి జాస్తి వసంత్, అడబాల ఆంజనేయులు, అనుకూల శ్రీకాంత్, కుంచే రామకృష్ణ, పాలకుర్తి ఆదినారాయణ, యల్లమిల్లి సీఎం, ఉండవల్లి చందు తదితరులు పాల్గొన్నారు.

SATYANARAYANA, JAGGAMPETA

SATYANARAYANA, JAGGAMPETA