Pithapuram: ఉచిత కంటి వైద్య శిబిరం.. 20 మందికి ఆపరేషన్లకు ఎంపిక!
Pithapuram: పిఠాపురం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహణ.
Pithapuram: ఉచిత కంటి వైద్య శిబిరం.. 20 మందికి ఆపరేషన్లకు ఎంపిక!
Pithapuram: పిఠాపురం స్థానిక సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో సోమవారం లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, కాకినాడ దృష్టి కంటి ఆసుపత్రి వైద్య బృందం సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ సందర్భంగా లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్ టి. కరుణ్ రాజు (కామేశ్వరరావు) మాట్లాడుతూ, ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పేద, అవసరమైన ప్రజలకు సేవలు అందిస్తున్నామని చెప్పారు.
పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కంటి సమస్యలకు సరైన వైద్యం పొందలేని వారికి ఇటువంటి శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.
శిబిరంలో దృష్టి కంటి ఆసుపత్రి దృష్టి కంటి ఆసుపత్రి డాక్టర్ . యన్.మాధురి మరియు వారి వైద్య బృందం కంటి సమస్యలతో బాధపడుతున్న పలువురు ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, వైద్య సలహాలు మరియు అవసరమైన చికిత్సను అందించారు. పరీక్షల అనంతరం కంటి ఆపరేషన్ అవసరమున్న సుమారు 20 మందిని గుర్తించి, తదుపరి చికిత్స మరియు ఆపరేషన్ కోసం కాకినాడ దృష్టి కంటి ఆసుపత్రికి తరలించినట్లు ట్రస్ట్ చైర్మన్ తెలిపారు.
పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడంలో సహకరించిన దృష్టి కంటి ఆసుపత్రి వైద్య బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజల అవసరాలను గుర్తించి మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మన ఊరు–మన బాధ్యత అధ్యక్షుడు కొండేపూడి శంకర్రావు, సెక్రటరీ నగేష్,పి.సి.పి.డబ్ల్యూ అధ్యక్షులు డి.ఎ.విక్టర్ బాబు, కె.యస్.యస్.వి.ప్రసాద్,కొమానపల్లి అప్పారావు, ట్రస్ట్ అడ్వయిజర్ యమ్.ఎలియా, లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ డైరెక్టర్ టి. బ్యులాగ్రేస్, ఆర్.యస్.యస్.నాయుకులు టి.రామచంద్రరావు,ట్రస్ట్ సభ్యులు జి.గణేష్ ,పి.ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.




