Uppada: ఉప్పాడ మత్స్యకారులకు రోడ్డు ప్రమాదం.. స్పందించిన GVK గంటా విజయ్ కుమార్!

Uppada: ఉప్పాడలో రోడ్డు ప్రమాదానికి గురైన మత్స్యకారులను నేత GVK గంటా విజయ్ కుమార్ హుటాహుటిన పిఠాపురం కార్తికేయ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 24 Oct 2026 9:32 AM IST
Uppada
X

Uppada: ఉప్పాడ మత్స్యకారులకు రోడ్డు ప్రమాదం.. స్పందించిన GVK గంటా విజయ్ కుమార్!

Uppada: తెల్లవారుజామున ఉప్పాడ నుంచి వాడలరేవుకు వేట నిమిత్తం వెళ్తున్న మత్స్యకారులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు మత్స్యకారులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

విషయం తెలుసుకున్న వెంటనే GVK గంటా విజయ్ కుమార్ హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను మెరుగైన వైద్యం నిమిత్తం పిఠాపురంలోని కార్తికేయ ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు.

అనంతరం ఆయన స్వయంగా ఆసుపత్రికి చేరుకుని వైద్య సిబ్బందితో మాట్లాడి, గాయపడిన మత్స్యకారులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

ఆపదలో ఉన్న మత్స్యకారులకు తక్షణమే స్పందించి, వైద్య సహాయం అందేలా చొరవ చూపిన GVK గంటా విజయ్ కుమార్.వేటకు వెళ్లిన మత్స్యకారులకు ప్రమాదం.. వెంటనే స్పందించిన GVK!

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్