Sri Sathya Sai: వైసీపీ జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా వజ్ర భాస్కర్ రెడ్డి!

Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా సీనియర్ నేత వజ్ర భాస్కర్ రెడ్డి పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం.

P.RAHAMTULLA, KADIRI
Published on: 15 Oct 2026 3:07 PM IST
Sri Sathya Sai
X

Sri Sathya Sai: వైసీపీ జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా వజ్ర భాస్కర్ రెడ్డి!

Sri Sathya Sai: రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో భాగంగా శ్రీ సత్య సాయి జిల్లా జడ్పీ చైర్మన్ స్థానాన్ని జనరల్ కి కేటాయించడంతో వైసిపి అధిష్టానం జెడ్పి అభ్యర్థిగా వజ్ర భాస్కర్ రెడ్డి పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ ఆవిర్భావం నుండి వజ్ర భాస్కర్ రెడ్డి పార్టీ కోసం పనిచేస్తున్నారు.

గతంలో 2019 ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి భంగపడి అప్పట్లో వైసీపీని వీడి బిజెపిలో చేరారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. వజ్ర భాస్కర్ రెడ్డి పార్టీకి చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని గతంలో లోటును భర్తీ చేసేలా ఆయనకి జడ్పీ చైర్మన్గా అవకాశము లభించిందని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI