Pithapuram: పిఠాపురంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన పట్టించుకోని అధికారులు!

Pithapuram: పిఠాపురం పాత బస్టాండ్ స్కూల్ పోలింగ్ బూత్ సమీపంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన. ప్రచార సమయం ముగిసినా గ్లాస్ గుర్తుకు ఓటేయాలంటూ జనసేన శ్రేణుల ప్రచారం.

V. Ramakrishna, Pithapuram
Published on: 1 Nov 2026 10:19 AM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన పట్టించుకోని అధికారులు!

Pithapuram: పిఠాపురం పట్టణంలో యథేచ్ఛగా సాగుతున్న ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు. ప్రచార గడువు ముగిసి నిశ్శబ్ద కాలం నడుస్తున్నా పట్టించుకోని జనసేన కార్యకర్తలు. పాత బస్టాండ్ పాఠశాల పోలింగ్ బూత్ సమీపంలోని ప్రధాన రహదారిపై రోడ్డుపైకి చేరిన నాయకులు, కార్యకర్తలు.

రోడ్డుపై వెళ్తున్న వాహనాలను, ప్రజలను ఆపుతూ "గ్లాస్ గుర్తుకు ఓటు వేయండి" అంటూ గట్టిగా అరుస్తూ గాజు గ్లాసు లు చూపిస్తూ ప్రచారం. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉన్నా గుంపులుగా చేరి నిబంధనలు బేఖాతరు చేస్తున్న వైనం.

ఇంత బహిరంగంగా నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నా కంటిచూపు మేరలో కనిపించని ఎన్నికల సిబ్బంది, ఫ్లయింగ్ స్క్వాడ్స్. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా పట్టించుకోని స్థానిక అధికారులు, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న వైనం.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పిఠాపురం మెయిన్ రోడ్డుపై కోడ్ ఉల్లంఘిస్తున్న వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram