Kakinada: ఈ నెల 21, 22 తేదీల్లో డిప్యూటీ సీఎం పవన్ పిఠాపురం పర్యటన!

Kakinada: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన ఏర్పాట్లను పరిశీలించి, అధికారులతో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సమీక్ష నిర్వహించారు.

RAMA KRISHNA, KKD
Published on: 18 Sept 2026 2:21 PM IST
Kakinada
X

Kakinada: ఈ నెల 21, 22 తేదీల్లో డిప్యూటీ సీఎం పవన్ పిఠాపురం పర్యటన!

Kakinada: ఈనెల 21, 22 వ తేదీలలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా....పిఠాపురం నియోజక వర్గ పర్యటన సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు నిమిత్తం పిఠాపురం ఆర్ ఆర్ బి హెచ్ గ్రౌండ్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్...

బహిరంగ సభ వద్ద వేదిక,బ్యారి కేటింగ్ వ్యవస్థ,స్టాల్స్ ఏర్పాట్లు, సంబంధిత అంశాలపై అధికారులతో చర్చించారు... అనంతరం కొండెవరం,రథాల పేట, అంబేద్కర్ కాలనీ,అగ్రహారం లో డిప్యూటీ సీఎం పర్యటన నిమిత్తం ఏర్పాటు లో భాగంగా జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

పాడా కార్యాలయం లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్రా ష్ట్ర ఉప ముఖ్యమంత్రి రెండు రోజుల పర్యటన కు అధికారులు సమన్వయం తో పని చేయండి. జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్...

ఈనెల 21, 22 వ తేదీలలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజక వర్గ పర్యటన లో భాగంగా పగడ్బందీ గా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

పారిశుద్ధ్య నిర్వహణ లో భాగంగా చెట్ల పొదలను శుభ్రం చేయాలని, రోడ్ల ను పరిశుభ్రంగా ఉంచాలని డి పి ఓ సూచించారు. పర్యటన లో భాగంగా తగిన బ్యారికెడింగ్ ను ఏర్పాటు చేయాలని సూచించారు.

ఈ నెల 21,22 వ తేదీ లలో పర్యటన లో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ తో ప్రారంభోత్సవాలు, శంకు స్థాపనలకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు పగడ్బందీ గా చేయాలనన్నారు. 22 వ తేదీ బహిరంగ సభ లో స్టాల్ ఏర్పాటు,సభ కు వచ్చు ప్రజలకు అవసరమైన త్రాగునీరు,ఇతర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు..

వైద్య ఆరోగ్య శాఖ వారు మెడికల్ క్యాంప్ తో పాటు అంబులెన్స్ సర్వీస్,స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉండాలని సూచించారు.

ఈ ఏర్పాట్లు పరిశీలన మరియు సమావేశం లో అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్,ఆర్డిఓ మల్లిబాబు,పాడా పిడి శివ రామ ప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు...*

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD