Kakinada: జిల్లాను ప్లాస్టిక్ రహితంగా మారుద్దాం.. ప్రజలకు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పిలుపు!
Kakinada: కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురంలో జరిగిన 'స్వచ్ఛ ఆంధ్రా - స్వర్ణాంధ్ర' కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.
Kakinada: జిల్లాను ప్లాస్టిక్ రహితంగా మారుద్దాం.. ప్రజలకు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పిలుపు!
Kakinada: స్వచ్ఛ ఆంధ్రా స్వర్ణ ఆంధ్రా లో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే కార్యక్రమాన్ని కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం సతీష్ చంద్ర నగర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.
పంచాయతీ పరిధి పారిశుధ్య పనులు గ్రామ ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయో జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్య కార్మికులు, పంచాయతీ కార్యదర్శి, మండల అభివృధి అధికారి లతో జిల్లా కలెక్టర్ స్వచ్ఛ ప్రతిజ్జ చేయించారు.
జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పాయింట్స్..
ప్రజలు ప్లాస్టిక్ రహితంగా జిల్లా ను తీర్చిదిద్దేందుకు సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ పిలుపు నిచ్చారు. పర్యావరణ రహిత సంచులను వినియోగించటం ద్వారా ప్లాస్టిక్ వినియోగాన్ని తాగించి తద్వారా పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సతీష్, పంచాయతీ కార్యదర్శి రాజా, పారిశుధ్య కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.




