Yeleswaram: ఏలేశ్వరంలో బీఎస్పీ సత్తా: 392 ఓట్లతో అపురూప్ గుర్తింపు

Yeleswaram: కాకినాడ జిల్లా ఏలేశ్వరం జడ్పీటీసీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి గునపర్తి అపురూప్ 392 ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్థిపై 34 ఓట్ల ఆధిక్యం కనబరిచారు.

AYYAPPA SWAMI, PRATTIPADU
Published on: 9 Nov 2026 2:51 PM IST
Yeleswaram
X

Yeleswaram: ఏలేశ్వరంలో బీఎస్పీ సత్తా: 392 ఓట్లతో అపురూప్ గుర్తింపు

ఏలేశ్వరం: కాకినాడ జిల్లా ఏలేశ్వరం జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి గునపర్తి అప్పలస్వామి (అపురూప్) తన ఓట్లతో ప్రత్యేక గుర్తింపు సాధించారు. జాతీయ పార్టీ అయిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి తిరుమల రౌతు కోటేశ్వరరావు 358 ఓట్లు సాధించగా, బహుజన సమాజ్ పార్టీ తరఫున పోటీ చేసిన గునపర్తి అప్పలస్వామి (అపురూప్) 392 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి కంటే 34 ఓట్లు అధికంగా సాధించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

పెద్ద రాజకీయ పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ నెలకొన్నప్పటికీ, బీఎస్పీ తరఫున పోటీ చేసిన అపురూప్‌కు 392 మంది ఓటర్లు మద్దతు తెలపడం విశేషంగా నిలిచింది. ఈ ఫలితం ఏలేశ్వరం మండలంలో బీఎస్పీకి లభించిన ఓటర్ల మద్దతును తెలియజేస్తోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయ

ఈ సందర్భంగా గునపర్తి అప్పలస్వామి (అపురూప్) మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటు అత్యంత విలువైనదని, అమ్ముడుపోని ఓట్లు నావేనని వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలు, సిద్ధాంతాల పట్ల నిబద్ధతతో పనిచేస్తున్న బహుజన సమాజ్ పార్టీపై ప్రజల్లో అవగాహన పెరుగుతోందని అన్నారు.

మాన్యవర్ కాన్షీరాం స్థాపించిన బహుజన సమాజ్ పార్టీ లక్ష్యం బహుజనులకు రాజకీయ అధికారం కల్పించడమేనని పేర్కొన్నారు. ఎన్నికల్లో తనకు ఓటు వేసి ప్రోత్సహించిన ఏలేశ్వరం మండల ప్రజలకు, ఓటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్నికల్లో వచ్చిన ఓట్ల సంఖ్యతోనే తన రాజకీయ ప్రయాణం ఆగిపోదని, అంబేద్కర్ రాజ్యాంగ ఆశయాలు, కాన్షీరాం రాజకీయ సిద్ధాంతాల స్ఫూర్తితో బహుజనుల హక్కుల కోసం, వారి రాజకీయ భాగస్వామ్యం కోసం నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో బహుజన రాజ్యాధికార సాధనే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లి పార్టీని మరింత బలోపేతం చేస్తానని అపురూప్ తెలిపారు.

సాధించిన 392 ఓట్లు తనకు మరింత బాధ్యతను పెంచాయని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అందుబాటులో ఉంటానని ఆయన పేర్కొన్నారు.

AYYAPPA SWAMI, PRATTIPADU

AYYAPPA SWAMI, PRATTIPADU