Jaggampeta: జనసేన పార్టీలో చేరిన బండారు వరప్రసాద్: ఆహ్వానించిన రమేష్
Jaggampeta: కిర్లంపూడి మండలం రామచంద్రపురం మాజీ ఎంపీటీసీ, వైసీపీ రాష్ట్ర నేత బండారు వరప్రసాద్ జగ్గంపేట జనసేన ఇన్‌ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ సమక్షంలో జనసేనలో చేరారు.
Jaggampeta: జనసేన పార్టీలో చేరిన బండారు వరప్రసాద్: ఆహ్వానించిన రమేష్
జగ్గంపేట: జగ్గంపేట నియోజకవర్గం, కిర్లంపూడి మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, వైసీపీ రాష్ట్ర దివ్యాంగుల యువజన విభాగం అధ్యక్షులు బండారు వరప్రసాద్ జనసేన పార్టీలో చేరారు.
జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ నాయకత్వంపై విశ్వాసంతో ఆయన జనసేన పార్టీలో చేరగా, పార్టీ నాయకుల సమక్షంలో తుమ్మలపల్లి రమేష్ జనసేన పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు బండారు వరప్రసాద్‌కు అభినందనలు తెలియజేశారు.




