Jaggampeta: ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను కలిసిన సంఘం నేతలు!

Jaggampeta: కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఏపీ వెలుగు వీవోఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు వినతిపత్రం అందజేశారు.

SATYANARAYANA, JAGGAMPETA
Published on: 7 Oct 2026 2:17 PM IST
Jaggampeta
X

Jaggampeta: ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను కలిసిన సంఘం నేతలు!

Jaggampeta: స్థానిక రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏ.పీ. వెలుగు వీ.ఓ.ఏ (యానిమేటర్స్) ఉద్యోగుల సంఘం (సిఐటియు) రాష్ట్ర కమిటీ సభ్యులు జగ్గంపేట ఎమ్మెల్యే, టిటిడి బోర్డు సభ్యులు, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాకు రావాల్సిన మూడు నెలల జీతాలు వెంటనే చెల్లించాలని, రాష్ట్ర వ్యాప్తంగా 28 వేల మంది వీ.ఓ.ఏలు పొదుపు సంఘ మహిళలకు దీర్ఘకాలంగా సేవలందిస్తున్నా కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేకుండా ఇబ్బందులు పడుతున్నామని, గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న శ్రీనిధి ఇన్సెంటివ్స్, జిల్లా బకాయిలు, 60 ఏళ్లు నిండిన వారి నిలిపివేసిన వేతనాలను వెంటనే చెల్లించాలని, హెల్త్ పాలసీ అమలు, ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని కోరారు.

సిమ్ కార్డు, ఇంటర్నెట్ ఛార్జీలు చెల్లించి పనిభారం తగ్గించాలని, అక్రమ తొలగింపులు, రాజకీయ వేధింపులు ఆపాలని, పొదుపు మహిళలకు సంబంధించి మహిళా మార్టులు, స్వావలంబన, అభయహస్తం, అమ్మఒడి బకాయిలు, 10 లక్షల వరకు వడ్డీ రాయితీ, గ్రూప్ ఇన్సూరెన్స్, బీమా విధానంలో భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

దీనిపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పందిస్తూ మీ న్యాయమైన డిమాండ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

SATYANARAYANA, JAGGAMPETA

SATYANARAYANA, JAGGAMPETA