Kakinada: గంజాయికి వ్యతిరేకంగా పోలీసుల వినూత్న అవగాహన ప్రచారం
Kakinada: అన్నవరం పోలీసుల ఆధ్వర్యంలో గంజాయి నియంత్రణపై వినూత్న ప్రచారం నిర్వహించారు. సమాచారం ఇస్తే వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్సై హరిబాబు తెలిపారు.
Kakinada: గంజాయికి వ్యతిరేకంగా పోలీసుల వినూత్న అవగాహన ప్రచారం
కాకినాడ: కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ గారి ఆదేశాలతో పెద్దాపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ ఏ బి జి తిలక్ గారు మరియు ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ బి సూర్య అప్పారావు గారి సూచనలతో యువత గంజాయి బారిన పడకుండా మత్తుమందుకు బానిస కాకుండా వారికి అవగాహన కల్పించడం కొరకు, మరియు ఎక్కడైనా గంజాయి ఉంటే వారు ఈ కింది నెంబర్లకు తెలియజేయండి అంటూ.
అట్లా తెలియజేసిన యెడల వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి మరియు లోకల్ పోలీస్ స్టేషన్ కి కూడా తెలియపరచవచ్చునని శంఖవరం మండలంలోని గ్రామాలకు పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా మరియు ఫ్లెక్స్ బోర్డుల ద్వారా ప్రజలలోకి పంపడమైనది . ఈ కార్యక్రమంలో అన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ హరిబాబు గ్రామస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారితో ప్రతిజ్ఞ చేయించారు.




