Pithapuram: పిఠాపురంలో జనసేన అభ్యర్థుల తరఫున సినీ నటుడు హైపర్ ఆది ప్రచారం!

Pithapuram: పిఠాపురం 18, 19 వార్డుల్లో జనసేన అభ్యర్థి దానం లాజర్ బాబు తరఫున హైపర్ ఆది ఎన్నికల ప్రచారం. గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి.

RAMA KRISHNA, KKD
Published on: 26 Oct 2026 1:08 PM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురంలో జనసేన అభ్యర్థుల తరఫున సినీ నటుడు హైపర్ ఆది ప్రచారం!

Pithapuram: పిఠాపురం పట్టణం రథాల పేట 18, 19వ వార్డుల పరిధిలో జనసేన పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి దానం లాజర్ బాబు తరఫున స్టార్ క్యాంపెయినర్ ప్రముఖ హాస్యనటుడు హైపర్ ఆది ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే పిఠాపురం అలాంటి పిఠాపురంలో మన గాజు గ్లాసులు గెలిపించాలని, పవన్ కళ్యాణ్ బలపరిచిన నాయకులను మనం గెలిపించుకుని ఆయన గిఫ్ట్ గా ఇవ్వాలని అప్పుడే మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 18 19 వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు సునీత, కామేశ్వరినీ, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD