Pithapuram: పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలోకి 32 మంది వైసీపీ నేతలు!

Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుతో పాటు 32 మంది వైఎస్ఆర్సీపీ నేతలు జనసేన పార్టీలో చేరారు.

V. Ramakrishna, Pithapuram
Updated on: 21 Sept 2026 7:25 PM IST
Pithapuram
X

Pithapuram: పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలోకి 32 మంది వైసీపీ నేతలు!

Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం, జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో పిఠాపురంలో ఈరోజు భారీ చేరికలు జరిగాయి. పెద్దాపురం, పిఠాపురం, సామర్లకోట, జగ్గంపేట నియోజకవర్గాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, సామర్లకోట మాజీ తాజా మున్సిపల్ చైర్మన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి మాజీ మున్సిపల్ చైర్మన్, నెక్కంటి సాయి ప్రసాద్, మాజీ వైస్ చైర్మన్లు కనకాల సుబ్రహ్మణ్యం మహాలక్ష్మి, సత్య భాస్కర్, మాజీ కౌన్సిలర్లు సహా మొత్తం 32 మంది ముఖ్య నేతలు వైసీపీని వీడి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ వారికి జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన 32 మంది:

వరుపుల సుబ్బారావు – మాజీ ఎమ్మెల్యే, పాంపన రామకృష్ణ, నెక్కంటి సాయి ప్రసాద్ మాజీ మున్సిపల్ చైర్మన్వి, జ్జపు రాజశేఖర్, త్సాలికి భాస్కరరావు, కొట్టి కిషోర్ పవన్, గుర్రాల మార్త, వాసంశెట్టి గంగ, అరెళ్ల వీర రాఘవులు, నీలంసెట్టి అమ్మాజీ, కట్టా రాజాబాబు, యండమూరి విజయలక్ష్మి, చింత శ్రీనివాసరావు, కోటి మల్లిబాబు, కురమదాస్ సతీష్ కుమార్, గంగిరెడ్డి అరుణ – మాజీ మున్సిపల్ చైర్మన్, సామర్లకోట, గంగిరెడ్డి కృష్ణమూర్తి, చల్లపల్లి వెంకట సత్యనారాయణ (లాయర్ శ్రీను), వేగి సత్యనారాయణ, చాడలాడ రాజ్ కుమార్, (బాబీ), జోకా వెంకట శ్రీనివాస్ విజయ్ కుమార్, వి.వి.ఎస్. సూరిబాబు, వి. రాజాబాబు, గాబు కృష్ణ, కనకాల మహాలక్ష్మి – మాజీ వైస్ చైర్మన్, పెద్దాపురం, కనకాల సుబ్రహ్మణ్యం, తాడి రాజశేఖర్, జల్లో డేవిడ్, పిన్నింటి రాము, పల్లె రాజు, నదిమింటి వెంకటరాజు, బి. అలీషా.

ఈ జనసేన పార్టీ చేరుకులో కొణిదెల పవన్ కళ్యాణ్ తో పాటు కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ , కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ , చైర్మన్లు వేగుళ్ల లీలా కృష్ణ, తలాటం సత్య , తోట సుధీర్ , పై మాన్ కమిటీ సభ్యులు పెండెం దొరబాబు, ఓదురి కిషోర్ పాల్గొన్నారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram