Tuni: తుని మున్సిపాలిటీ ఎన్నికలు..ఉదయం 10 గంటల వరకు 21 శాతం పోలింగ్ నమోదు!

Tuni: కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉదయం 10 గంటల వరకు 21 శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్లు ఉత్సాహంగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

MANIKANTA, TUNI
Published on: 1 Nov 2026 10:54 AM IST
Tuni
X

Tuni: తుని మున్సిపాలిటీ ఎన్నికలు..ఉదయం 10 గంటల వరకు 21 శాతం పోలింగ్ నమోదు!

Tuni: కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు. తుని పరిధిలోని 35 వార్డులలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

తాజా అప్‌డేట్ ప్రకారం.. ఉదయం 10 గంటల సమయానికి తుని మున్సిపాలిటీలో 21 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఉదయం వేళే పోలింగ్ కేంద్రాలకు భారీ సంఖ్యలో తరలివచ్చిన ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు సైతం ఉత్సాహంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

అయితే, మరోవైపు క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయి. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్నప్పటికీ, పలు పోలింగ్ కేంద్రాల వద్ద వృద్ధులకు మరియు దివ్యాంగులకు కనీసం వీల్‌చైర్లు వంటి వసతులు సరిగ్గా అందుబాటులో లేకపోవడంతో వారు స్వల్ప ఇబ్బందులు పడుతున్నట్లు ఓటర్లు వాపోతున్నారు.

మరోవైపు శాంతిభద్రతల పరంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద మీడియాపై ఆంక్షలు, నిబంధనల నడుమ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పటికీ, ఓటర్ల రాక మాత్రం జోరుగానే సాగుతోంది. రానున్న గంటల్లో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI