Kadapa: కడప జిల్లాలో వైఎస్సార్‌సీపీ సత్తా.. 8 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కైవసం!
Kadapa: వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎంపీటీసీ ఏకగ్రీవాల పర్వం. మొత్తం 351 స్థానాలు ఏకగ్రీవం కాగా, బి.కోడూరు, పోరుమామిళ్ల, కలసపాడు పరిధిలో 8 MPTC స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న వైఎస్సార్‌సీపీ.
Kadapa: కడప జిల్లాలో వైఎస్సార్‌సీపీ సత్తా.. 8 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కైవసం!
Kadapa: వైఎస్ఆర్ కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి కొనసాగుతుండగా, MPTC ఎన్నికల్లో ఏకగ్రీవాల పర్వం కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 413 MPTC స్థానాలు ఉండగా, ఏకంగా *351 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
ఇందులో అధిక శాతం అధికార కూటమి (TDP+JSP+BJP) కైవసం చేసుకున్నప్పటికీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం తన బలాన్ని నిరూపించుకుంటూ 8 కీలక స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుని జాక్ పాట్ కొట్టింది.
జగన్ సొంత జిల్లాలో వైసీపీకి అభ్యర్థులే దొరకడం లేదంటూ కూటమి చేస్తున్న ప్రచారానికి చెక్ పెడుతూ ఈ 8 స్థానాల్లో YCP అభ్యర్థులు పోటీ లేకుండానే విజయం సాధించారు.
ఏకగ్రీవంగా గెలిచిన YCP అభ్యర్థుల వివరాలు బి.కోడూరు మండలం పాయలకుంట్లలో - లక్ష్మీదేవి, మేకవారిపల్లెలో - శిరీష, పోరుమామిళ్ల-3లో - రుక్సానా, సిద్ధవరంలో- గిరి ప్రణీత్ రెడ్డి, టి. చల్లగరిగెల్లలో - ముత్యాల ప్రసాద్గా, నుగపెంటలో - కృష్ణయ్య, కలసపాడు (M) పిడుగుపల్లెలో- నారాయణ, మహాసందిపల్లెలో - నారాయణరెడ్డి. ఈ విజయాలతో కడప జిల్లాలో YCP ఇంకా బలంగానే ఉందని, కార్యకర్తల్లో ఉత్సాహం నింపినట్లయింది.




