Kadapa: సుప్రీం తీర్పుపై వైసీపీ అబద్ధపు ప్రచారం: ఆదినారాయణ రెడ్డి

Kadapa: స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు చెప్పింది ఒకటైతే వైసీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కడపలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ధ్వజమెత్తారు.

G. RAVI KUMAR, KADAPA
Published on: 21 Oct 2026 8:36 PM IST
Kadapa
X

Kadapa: సుప్రీం తీర్పుపై వైసీపీ అబద్ధపు ప్రచారం: ఆదినారాయణ రెడ్డి

కడప: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సుప్రీం కోర్టు చెప్పింది ఒకటైతే వైసీపీ నేతలు ఇక్కడ చేసే ప్రచారం మరొకటినీ బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. అబద్దాలు ప్రచారం చేయడంలో జగన్ ఆయన పార్టీ నేతలు వారి తేరారని ఆయన విమర్శించారు.

హైకోర్టు వైసిపి అప్పిలు కొట్టేస్తే సుప్రీంకోర్టుకు వెళ్లి ఎన్నికలను వివాదం చేస్తున్నారు విమర్శించారు. కేంద్ర బలగాలు కావాలి, ఎన్నికలు వాయిదా వేయాలి, అడిగితే 19 చోట్ల నామినేషన్ ఇబ్బందులు కలిగాయని కోరితే అక్కడ జరిగిన వాస్తవాలు తెలుసుకొని పరిష్కారం చేయాలని కోర్టు ఆదేశాలు ఉన్నాయన్నారు.

రెండు రోజులు గడువు ఇచ్చి ఎన్నికలు సజావుగా జరపాలని కోర్టు ఆదేశించింది. వైసిపి అంతా డూప్ తో బ్రతకడమే సరిపోయిందనీ ఆయన విమర్శించారు. వైసిపి హయాంలో ఎన్నికలు ఎలా జరిగాయో ప్రజలకు తెలియవా.. ప్రశ్నించారు.

వివేకాను ఎవరు చంపారో విజయమ్మ తేల్చాలన్నారు.28 నెలల్లో వైసిపి కంటే కూటమికి ఎక్కువ మార్కులు తెచ్చుకున్నామన్నాడు. బిటెక్ రవిని తనను చంపాలని ప్రయత్నం చేయలేదా అని ప్రశ్నించారు.

G. RAVI KUMAR, KADAPA

G. RAVI KUMAR, KADAPA