Proddatur: ప్రొద్దుటూరులో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన బొమ్మిరెడ్డి ప్రసాద్ రెడ్డి

Proddatur: వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీకి షాక్ తగిలింది. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సమక్షంలో బొమ్మిరెడ్డి ప్రసాద్ రెడ్డి టీడీపీలో చేరారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 17 Oct 2026 5:41 PM IST
Proddatur
X

Proddatur: ప్రొద్దుటూరులో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన బొమ్మిరెడ్డి ప్రసాద్ రెడ్డి

ప్రొద్దుటూరు: వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ​వైసీపీ బొమ్మిరెడ్డి ప్రసాద్ రెడ్డి ఆ పార్టీ విడి, ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

ప్రసాద్ రెడ్డికి ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో 5 వార్డ్ నుంచి పోటీ చేసిన బొమ్మిరెడ్డి ప్రసాద్ రెడ్డి, కేవలం 60 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు..

తాజాగా టిడిపిలో చేరిన ఆయనను స్థానిక ఎన్నికల్లో 52వ వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థిగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అధికారికంగా ప్రకటించారు..

ఈ చేరికల కార్యక్రమంలో టిడిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నంద్యాల రాఘవరెడ్డి, టిడిపి యువనాయకులు నంద్యాల కొండారెడ్డి, శివాలయం చైర్మన్ వంగల నారాయణరెడ్డి, ఈవి సుధాకర్ రెడ్డి, బచ్చల ప్రతాప్, మాజీ కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి, శంకర్ రెడ్డి, బసిరెడ్డి వీరకుమార్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR