Rayachoti: ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలి!
Rayachoti: రాయచోటిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తూ, ప్రజలతో మమేకమై పార్టీని బలోపేతం చేయాలని శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
Rayachoti: ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలి!
Rayachoti: ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలపై స్పందించే కార్యకర్తలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అసలైన బలమని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపు నిచ్చారు.రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులో వైఎస్సార్‌సీపీలో వివిధ హోదాలు పొందిన పార్టీ శ్రేణులకు శ్రీకాంత్‌రెడ్డి గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ పదవి అంటే కేవలం గుర్తింపు కాదని, ప్రజలకు మరింత చేరువగా ఉండి సేవ చేయడానికి లభించిన బాధ్యతగా భావించాలని సూచించారు.గుర్తింపు కార్డు చేతిలో ఉంటే సరిపోదని.. ఆ పదవికి తగిన బాధ్యతను ప్రజల్లో చూపించాలని అన్నారు. వార్డులోని ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ, ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు.
ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం ద్వారానే పార్టీపై ప్రజల్లో మరింత విశ్వాసం ఏర్పడుతుందని పేర్కొన్నారు. స్థానికంగా ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పార్టీ దృష్టికి తీసుకువచ్చి, ప్రజల తరఫున బలంగా నిలవాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు స్టూడియో బాబ్జి, నరసింహులు, ఇలియాస్, అక్బర్, చాను, అలీ,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.




