Badvel: బద్వేల్‌లో వన్యప్రాణ సంరక్షణ వారోత్సవాలు: అటవీ శాఖ అవగాహన
Badvel: కడప జిల్లా బద్వేల్ ఫాతిమా స్కూల్‌లో వన్యప్రాణ సంరక్షణ వారోత్సవాలు నిర్వహించారు. వన్యప్రాణులను హింసిస్తే 5 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని ఎఫ్ఆర్వో హెచ్చరించారు.
Badvel: బద్వేల్‌లో వన్యప్రాణ సంరక్షణ వారోత్సవాలు: అటవీ శాఖ అవగాహన
కడప జిల్లా: గోపవరం మండలం బద్వేల్ పట్టణం నందు గల ఫాతిమా ఆంగ్ల మాధ్యమ పాఠశాల యందు ఈరోజు అనగా 03-10-2026 వ తేదీన " వన్యప్రాణ సంరక్షణ - వారోత్సవాలు" కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప జిల్లా అటవీ శాఖ అధికారి K.M. నయీమ్ ఆలి, సహ అధికారి CH. పెద్దయ్య . మరియు ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో - పాల్గోన్న ముఖ్య అతిథి - ఫారెస్ట్ రెంజ్ ఆఫీసర్ K.M. నయీమ్ విధ్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతు వన్యప్రాణులను కాపాడటం మనందరి కర్తవ్యం - చెట్లను నాటాలి- పర్యావరాన్ని కాపాడాలి - అనే అంశాలపై ప్రసంగించడం జరిగింది.
వన్య ప్రాణులను హింసించినా, చంపిన అది నేరం అవుతుందని, 5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించ వలసి వస్తుందని కావున వన్య ప్రాణులను, అడవులను కాపాడ వలసిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పడం జరిగింది.
పాఠశాల ప్రధానో పాధ్యా యురాలు సిస్టర్ జ్యోతిష్య గారు మాట్లాడుతు ఒకప్పుడు అడవులనేవి క్రూరమృగాలకు, సాదు జంతువులకు నిలయము కాని నేడు అవి కనుమరుగవుతున్నాయని, వాటిని కాపాడ వలసిన బాధ్యత మనా అందరిపై ఉందని చెప్పడం జరిగినది.ఈ కార్య క్రమానికి ఉ పాధ్యాయిన్నీ ఉపాధ్యాయురాళ్ళ ను మరియు పాఠశాల PET , NNC మాష్టర్లు -పాల్గొనడం జరిగినది.




