Duvvur: దువ్వూరులో వీఆర్ఏల నిరవధిక సమ్మె..18వ రోజుకు చేరిన ఆందోళన!
Duvvur: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దువ్వూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల నిరసన 18వ రోజుకు చేరిక. సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం ఆగదని స్పష్టీకరణ.
Duvvur: దువ్వూరులో వీఆర్ఏల నిరవధిక సమ్మె..18వ రోజుకు చేరిన ఆందోళన!
Duvvur: తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట మండల గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం నాటికి 18వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వీఆర్ఏలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వీఆర్ఏ సంఘం నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన వీఆర్ఏలకు జూనియర్ అసిస్టెంట్, వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలని, నామినీలుగా పనిచేస్తున్న వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే స్కేల్ పే అమలు చేసి సర్వీస్ క్రమబద్ధీకరించాలని, కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని స్పష్టం చేశారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల వీఆర్ఏల సంఘం ప్రతినిధులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పలు ప్రజా సంఘాల నాయకులు శిబిరాన్ని సందర్శించి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.




