Badvel: బద్వేల్‌లో వీఆర్ఏల సహాయ నిరాకరణ ధర్నా ప్రారంభం!

Badvel: కడప జిల్లా బద్వేల్‌లో వీఆర్ఏల సహాయ నిరాకరణ ధర్నా ప్రారంభమైంది. తెలంగాణ తరహాలో పే స్కేల్, నామినీలు, ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.

B. ARUN KUMAR, BADVEL
Published on: 23 Sept 2026 2:01 PM IST
Badvel
X

Badvel: బద్వేల్‌లో వీఆర్ఏల సహాయ నిరాకరణ ధర్నా ప్రారంభం!

Badvel: ఏపీ వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు కడప జిల్లా బద్వేల్ డివిజన్ బద్వేల్ మండలంలో మొదటిరోజు సహాయ నిరాకరణ ధర్నా కార్యక్రమంలో బద్వేల్ మండలంలోని వీఆర్ఏలు పాల్గొనడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వీఆర్ఏ హరికృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ తమ జీతాలు వెయ్యి రూపాయలు కూడా పెంచిన పాపాన పోలేదని అరాకొర జీతాలతో ఆర్థిక ఇబ్బందులు పడుతూ కుటుంబ సభ్యులు వ్యాధి బారిన పడినప్పుడు ఆసుపత్రులకు కూడా ఖర్చులు లేకుండా ఇబ్బందులు పడుతున్నామని, తమపై అధికారులు వీఆర్ఏలను బానిసలుగా చూస్తూ మా చేత వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మా జీవితాలు ఇలాగే కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా తమకు జీతాలను కూడా పెట్టకుండా పై అధికారులు ఇబ్బంది పెడుతున్నారని తెలియజేశారు.ముఖ్యమైన డిమాండ్లు తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా జీవో నెంబర్ 81 ప్రకారం మా వీఆర్ఏ సోదరులందరికీ నామినీలు, ప్రమోషన్లు, పే స్కేలు ఇవ్వాలి, వాచ్మెన్, అటెండర్, డ్రైవర్ టైపిస్టు, రికార్డ్ అసిస్టెంట్ తదితర పనులన్నీ మా గ్రామ రెవెన్యూ సహాయకులతో చేయించుకుంటున్నారు. అదే పోస్ట్ లు

మా వీఆర్ఏలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము అని అన్నారు.అంతేకాకుండా పై అధికారులు ప్రతి చిన్న పనికి మమ్మల్ని ఉపయోగించుకుంటూ సరైన సమయానికి జీతాలు ఇవ్వకపోగా ఎవరైనా తమ డిమాండ్లను అడిగినప్పుడు వారిని మానసికంగా వేధిస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో గుర్రాల హరికృష్ణ, రాగే గురయ్యా, వెంకటనారాయణ,గుర్రప్ప,రాజేష్, రమణ, సురేష్, జయపాల్, రాజన్న, ఎల్లమ్మ, పుల్లమ్మ, సాయమ్మ, లావణ్య,రాణి,సుప్రజ, ప్రమీల, చెన్నమ్మ,మాణిక్యమ్మ, నరసమ్మ, సావిత్రి,అమ్మనమ్మ తదితరులు పాల్గొన్నారు. గ్రామ రెవెన్యూ సహాయకుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.

B. ARUN KUMAR, BADVEL

B. ARUN KUMAR, BADVEL