Mydukur: అగ్నివీరుడు కిరణ్ అంతిమ సంస్కారాల్లో అండగా నిలిచిన తమ్మిశెట్టి దంపతులు
Mydukur: మైదుకూరు మండలం వనిపెంట గ్రామానికి చెందిన అగ్నివీరుడు కిరణ్ అంతిమ సంస్కారాల్లో ప్రముఖ నేత తమ్మిశెట్టి సుబ్బారాయుడు దంపతులు అండగా నిలిచారు.
Mydukur: అగ్నివీరుడు కిరణ్ అంతిమ సంస్కారాల్లో అండగా నిలిచిన తమ్మిశెట్టి దంపతులు
మైదుకూరు: కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం వనిపెంట గ్రామానికి చెందిన కిరణ్ ఛత్తీస్‌గఢ్‌లో ఆర్మీ విభాగంలో విధి నిర్వహణలో ఉన్న అగ్నివీరుడు కిరణ్ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి.
దేశ రక్షణ కోసం సేవలందించిన ఈ యువ జవాన్ అంతిమ యాత్రలో శ్రీ తమ్మిశెట్టి సుబ్బారాయుడు గారు, శ్రీమతి తమ్మిశెట్టి సుభద్రమ్మ గారు చూపిన చొరవ, పెద్దరికం స్థానికుల హృదయాలను కదిలించింది.
కిరణ్ భౌతికకాయం స్వగ్రామానికి చేరుకున్నప్పటి నుంచి అంతిమ సంస్కారాలు పూర్తయ్యే వరకు ప్రతి ఒక్క ఏర్పాటూ స్వయంగా దగ్గరుండి చూసుకున్నారు తమ్మిశెట్టి దంపతులు. కుటుంబ సభ్యులకు మానసిక స్థైర్యాన్ని ఇస్తూ, శ్మశానవాటిక వరకు అంతిమ యాత్రలో తోడు నడిచి, దహన సంస్కారాల క్రతువును విజయవంతంగా పూర్తి చేయించారు.
దేశ సేవలో అమరుడైన వీరుడికి సముచిత వీడ్కోలు పలికే క్రమంలో, ఒక కుటుంబ పెద్దలుగా ముందుండి సేవలందించిన తమ్మిశెట్టి సుబ్బారాయుడు, సుభద్రమ్మ దంపతుల మానవతా దృక్పథాన్ని, సేవాభావాన్ని గ్రామ ప్రజలు, బంధువులు కొనియాడారు.




