Proddatur: ప్రొద్దుటూరు 30వ వార్డు కౌన్సిలర్‌గా ఉట్టి నరేంద్ర ఏకగ్రీవ ఎన్నిక!

Proddatur: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో టీడీపీ క్లీన్ స్వీప్. 30వ వార్డు కౌన్సిలర్‌గా ఉట్టి నరేంద్ర ఏకగ్రీవ ఎన్నిక, డిక్లరేషన్ పత్రం అందజేత.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 25 Oct 2026 6:02 PM IST
Proddatur
X

Proddatur: ప్రొద్దుటూరు 30వ వార్డు కౌన్సిలర్‌గా ఉట్టి నరేంద్ర ఏకగ్రీవ ఎన్నిక!

Proddatur: వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (కూటమి) సంచలన విజయం సాధించింది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 52 మున్సిపల్ వార్డులలో కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నికై, కూటమి క్లీన్ స్వీప్ నమోదు చేసింది. ​ఇందులో భాగంగా 30వ వార్డు కౌన్సిలర్‌గా ఉట్టి నరేంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఎన్నికల అధికారుల నుంచి ఆయన తన ఎన్నికల డిక్లరేషన్ పత్రాన్ని అందుకున్నారు. ​ ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్‌గా నంద్యాల రాఘవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మునిసిపల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా ఆయన అధికారిక డిక్లరేషన్ స్వీకరించారు. ​ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై అభినందనలు తెలిపారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR