Rajampet: ఒంటిమిట్ట మండలంలో టీడీపీకి అనూహ్య ప్రజాధరణ
Rajampet: రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం మలకాటపల్లెలో టీడీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేసి మౌలిక వసతుల కల్పనకు హామీ ఇచ్చారు.
Rajampet: ఒంటిమిట్ట మండలంలో టీడీపీకి అనూహ్య ప్రజాధరణ
కడప: గతంలో వైసీపీకి మెజారిటీ వచ్చిన ప్రాంతాల్లోనూ టీడీపీకి అనూహ్య స్పందన వస్తోందని డిపి నాయకులు తెలిపారు. రాజంపేట నియోజకవర్గం జీపీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది.
రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం మలకాటపల్లెలో టీడీపీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తున్న అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని టీడీపీ నేతలు చెబుతున్నారు.
మలకాటపల్లెతో పాటు ఒంటిమిట్ట మండలంలోని పలు గ్రామాల్లో టీడీపీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎంపీటీసీ అభ్యర్థి అరవ వెంకట సుబ్బమ్మ మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తోందని తెలిపారు. గ్రామాల్లో చిన్నచిన్న సమస్యలు, వీధి దీపాలు వంటి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇస్తున్నట్లు చెప్పారు.
ఇక జడ్పీటీసీ అభ్యర్థి మాట్లాడుతూ.. ప్రచారానికి వెళ్తున్న ప్రతి గ్రామంలో ప్రజలు సాదరంగా స్వాగతిస్తున్నారని తెలిపారు. సీసీ రోడ్లు, తాగునీటి సరఫరా వంటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
మరోవైపు ఒంటిమిట్ట మండలం టీడీపీ నాయకుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మలకాటపల్లితో పాటు గతంలో వైసీపీకి మెజారిటీ వచ్చిన ప్రాంతాల్లోనూ టీడీపీకి అనూహ్య స్పందన వస్తోందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, పెన్షన్లు, గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని తెలిపారు.
జీపీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వేళ గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఈ ప్రచారం.. రాజకీయంగా ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.




