Proddatur: ప్రొద్దుటూరు 13వ వార్డు కౌన్సిలర్‌గా వైఎస్ ఇంతియాజ్ అహ్మద్ ఏకగ్రీవం!
Proddatur: ప్రొద్దుటూరు 13వ వార్డు కౌన్సిలర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్ ఇంతియాజ్ అహ్మద్.. టీడీపీ నాయకులు బద్వేలు శ్రీనివాసులరెడ్డిని కలసి కృతజ్ఞతలు తెలిపారు.
Proddatur: ప్రొద్దుటూరు 13వ వార్డు కౌన్సిలర్‌గా వైఎస్ ఇంతియాజ్ అహ్మద్ ఏకగ్రీవం!
Proddatur: ప్రొద్దుటూరు మునిసిపల్ 13వ వార్డు కౌన్సిలర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఇంతియాజ్ అహ్మద్, ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ సభ్యులు బద్వేలు శ్రీనివాసులరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ అహ్మద్ వాళ్ళ చిన్నానలు వైఎస్ గౌస్, వై ఎస్ రఫీ, వారి మిత్రులు శ్రీనివాసులరెడ్డిని శాలువాతో సత్కరించి, తన ఎన్నికకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ.. మొదటిసారిగా నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ ఇంతియాజ్ అహమద్ కు వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ నంద్యాల రాఘవరెడ్డి కి మంచి పేరు వచ్చేలా మీరందరూ కలిసి పని చేయాలని కోరారు.




